📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : పోలీసు కుటుంబాల ఆరోగ్య భద్రతకు మెగా వైద్య శిబిరం

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం (స్వచ్ఛవార్త ) :

ప్రజల రక్షణలో నిరంతరం విధులు నిర్వహిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా పోలీసు సిబ్బంది, హోంగార్డులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ భీమవరంలోని వర్మ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 

పోలీసు సిబ్బంది సంక్షేమానికి శాఖాపరంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం పొందేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు దోహదపడతాయని అన్నారు.

వర్మ హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించిన శిబిరంలో గుండె, కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, మూత్ర పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బంది, హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. శిబిరం నిర్వహణకు సహకరించిన వర్మ హాస్పిటల్స్ యాజమాన్యం, వైద్య బృందానికి జిల్లా పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, వర్మ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ పి.ఆర్.కె. వర్మ, ఏఆర్ డీఎస్పీ ఎం.వి.వి. సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.వి.వి.ఎన్. సత్యనారాయణ, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) ఇ. ఇందుమతి, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్. మోజేష్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం