📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : స్వర్ణ రజిత కవచాలంకారంలో శ్రీ మావుళ్ళమ్మ.. దర్శించుకున్న శాసనమండలి చైర్మన్, జాయింట్ కలెక్టర్ల దంపతులు

ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :

భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారు స్వర్ణ రజిత కవచాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏలూరు జిల్లా, భీమవరం జిల్లాల జాయింట్ కలెక్టర్లు భరత్ గౌడ్, కల్పన దంపతులతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వేదమంత్రాలతో పూజలు.. ఆశీర్వచనాలు :

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులకు ఆలయ ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ మల్లికార్జున శర్మ, వేదపండితులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.

పూజా కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికేలా ఆంజనేయ ప్రసాద్, మిర్తిపాఠి గున్నేశ్వరరావు, గుసిడి నాగశిరీష, అరసవల్లి సుబ్రహ్మణ్యం, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం