📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : గాయత్రీ దేవిగా మావుళ్ళమ్మ భక్తులకు దర్శనం

ప.గో  జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :

పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మావుళ్లమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 30 మంది వేదపండితులతో నిర్వహించిన చతుర్వేద పారాయణం, వేదసభ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేదపండితులు పాల్గొన్నారు. 

దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నేతృత్వంలో నాలుగు వేదాల్లోని ఎంపిక చేసిన మంత్రాలను పండితులు శ్రావ్యంగా పారాయణం చేశారు. వేదమంత్రాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, అనంతరం చతుర్వేద పారాయణంతో నిర్వహించిన అమ్మవారి పంచహారతుల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, అరసవల్లి సుబ్రమణ్యం, అతికేల ఆంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం