Bhimavaram : శ్రీ మహాలక్ష్మి అలంకరణలో మావుళ్లమ్మ అమ్మవారు.. వైభవంగా ఊంజల్ సేవ
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు గురువారం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఊంజల్ సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు హాజరయ్యారు.

ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊంజల్ సేవలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కార్యక్రమంలో ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మల్లువలస లక్ష్మి నిర్మల, యండ సత్యవతి, గొంతెన రమణ, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
