📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Buttayagudem : ఈనెల 5 వ తేదీన భవన నిర్మాణ కార్మికులధర్నా.. ఐ.ఎఫ్.టి.యు నేత కె.వి.రమణ


ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం : స్వచ్ఛవార్త :

భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 5వ తేదీన ఏలూరులో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రమణ గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మండలం లోని దొరమామిడిలో ఆదర్శ తాపీ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు అనుబంధం) సమావేశం యూనియన్ అధ్యక్షుడు ముకుందం నారాయణస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. 

ఈ సమావేశంలో ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐ ఎఫ్ టి యు అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ మాట్లాడుతూ.. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా గతంలో అమలు చేసిన 14 సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఐదో తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాలని ప్రగతశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని అన్నారు. ఈనెల ఐదో తారీకు ఏలూరు జిల్లా లేబర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో కార్మికుల పాల్గొవాలని పిలుపునిచ్చారు. నిర్మాణ కార్మికులందరూ పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రమణ కోరారు.  

సమావేశంలో ప్రధాన కార్యదర్శి కలపాల రవి. పాకిరం రాజేష్ .షేక్ బాజీ .కొండపల్లి శ్రీనివాస్ .పల్లి సుబ్బారావు. రెడ్డి సురేష్ కొప్పాల నాగరాజు దొంగ వరప్రసాద్ షేక్ మొహిద్దీన్ భాష టేకు మంగారావు, నాగరాజు, గురుగుంట్ల బాబుల్ రెడ్డి కలపాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం