📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Buttayagudem : 5వ రోజుకు మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె.. మద్దతు తెలిపిన పి.డి.ఎస్.యు, పి.వై.ఎల్

ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం (స్వచ్ఛవార్త) :

డిమాండ్ల సాధనకై వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు సిబ్బంది చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరుకుంది. కోటరామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శనివారం పి వై ఎల్, పి డి ఎస్ యు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పి వై ఎల్ జిల్లా కన్వీనర్ తగరం బాబురావు, డివిజన్ అధ్యక్షులు కెచ్చేల పోతిరెడ్డి, అడ్వకేట్ బి.శ్యాంబాబు మాట్లాడుతూ.. దాదాపుగా 15 సంవత్సరాలు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాలను శాంతియుతంగా అడుగుతున్నప్పటికీ వారి సమస్యను పరిష్కరించకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి అన్నారు. 

కాంట్రాక్టు సిబ్బంది డిమాండ్స్ న్యాయమైన కోరికలుగా భావించి, వారు చేసే ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తక్షణమే 100% గ్రాస్ వేతనం ఇవ్వాలని, అదేవిధంగా రెగ్యులర్ చేయాలని అన్నారు. హెచ్ఆర్ఏ, డిఏ, ఉద్యోగ భద్రత , హెల్త్ కార్డు, ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. 

ఉద్యోగం చేస్తూ మరణించిన కుటుంబానికి 50 లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలని, అన్నారు. ఉద్యోగం చేస్తూ అనారోగ్య బారిన పడితే సిక్ లీవ్ లను ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాయకులతో చర్చలు జరిపి తక్షణమే కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోపి వై ఎల్ డివిజన్ కార్యదర్శి గురుగుంట్ల ప్రసాద్ రెడ్డి, నడపాల ముక్కారెడ్డి, కరకాల నడిపి రాజు, పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం