📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : జిల్లాలో 542 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు : కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా : ఏలూరు (స్వచ్ఛవార్త) :

జిల్లాలోని 542 గ్రామ పంచాయతీలకు సంబంధించి 542 సర్పంచ్ లు , 5676 గ్రామ వార్డ్ మెంబెర్స్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలియజేసారు.

గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రిజర్వేషన్లు :

జిల్లాలోని 542 గ్రామ పంచాయతీలకు సంబంధించి మహిళలకు 266 స్థానాలు, జనరల్ కు 276 స్థానాలు కేటాయించారు. వాటిలో షెడ్యూల్డ్ ఏరియాలోని 63 స్థానాలకుగాను మహిళలకు 31 స్థానాలు , జనరల్ కు 32 స్థానాలు , 100 శాతం షెడ్యూల్డ్ తెగల తండాలు కలిగిన 2 ఎస్టీ పంచాయతీలలో ఒకటి మహిళలకు, ఒకటి జనరల్ కు కేటాయించినట్లు చెప్పారు. అదేవిధంగా నాన్ -షెడ్యూల్డ్ ప్రాంతాలలోని 479 స్థానాలకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలకు 6 స్థానాలకు గాను 2 మహిళలకు, 4 జనరల్ కు, షెడ్యూల్డ్ కులాలలకు 121 స్థానాలకు గాను 56 మహిళలకు, 65 జనరల్ కు, వెనుకబడిన తరగతులకు 104 స్థానాలకు గాను 52 మహిళలకు, 52 జనరల్ కు, రిజర్వు కాని కేటగిరీకి 246 స్థానాలకు గాను 124 మహిళలకు, 122 జనరల్ కు కేటాయించినట్లు చెప్పారు.

వార్డ్ మెంబెర్స్ స్థానాలకు రిజర్వేషన్లు :

జిల్లాలోని 5676 వార్డ్ మెంబర్ల స్థానాలకు సంబంధించి షెడ్యూల్డ్ ఏరియాలోని 63 గ్రామ పంచాయతీలలోని 626 వార్డ్ మెంబర్ల స్థానాలకుగాను మహిళలకు 313 స్థానాలు , జనరల్ కు 313 స్థానాలు కేటాయించారు. షెడ్యూల్డ్ కులాలకు 403 స్థానాలకు గాను 187 స్థానాలు మహిళలకు, 216 స్థానాలు జనరల్ కు కేటాయించారు. రిజర్వు కాని కేటగిరీకి సంబంధించి 223 స్థానాలకు గాను 126 మహిళలకు, 97 జనరల్ కు కేటాయించినట్లు చెప్పారు.

నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని 479 గ్రామ పంచాయతీలలోని 5050 వార్డ్ మెంబర్ల స్థానాలకుగాను మహిళలకు 2525 స్థానాలు , జనరల్ కు 2525 స్థానాలు కేటాయించారు. షెడ్యూల్డ్ తెగలకు 92 స్థానాలకు గాను 37 మహిళలలకు, 55 జనరల్ కు కేటాయించారు. షెడ్యూల్డ్ కులాలకు 1289 స్థానాలకు గాను 560 స్థానాలు మహిళలకు, 729 స్థానాలు జనరల్ కు కేటాయించారు. వెనుకబడిన తరగతులకు సంబంధించి 1099 స్థానాలకు గాను 521 మహిళలకు , 574 జనరల్ కు కేటాయించారు. రిజర్వు కాని కేటగిరీకి సంబంధించి 2570 స్థానాలకు గాను 1407 మహిళలకు, 1163 స్థానాలు జనరల్ కు కేటాయించినట్లు కలెక్టర్ తెలియజేసారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం