📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ (స్వచ్ఛవార్త) :

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం, 1994 (చట్టం నం. 13 ఆఫ్ 1994) ప్రకారం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన 12.10.2026 తేదీ ప్రభుత్వ ఉత్తర్వులు నం. 154లోని ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 27 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ), 27 మండల పరిషత్ అధ్యక్ష పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 జెడ్పీటీసీ రిజర్వేషన్ల వివరాలు :

జిల్లాలోని 27 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) పదవులకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలకు 4 స్థానాలలో రెండు మహిళలకు, రెండు జనరల్ కు , షెడ్యూల్డ్ కులాలకు 6 స్థానాలలో మహిళలకు 3, జనరల్ కు 3, , వెనుకబడిన తరగతులకు 3 స్థానాలలో 1 మహిళలకు, 2 జనరల్ కు మిగిలిన 14 స్థానాలు రిజర్వు కాని కేటగిరీకి కేటాయించగా వాటిలో 7 స్థానాలు మహిళలకు, 7 స్థానాలు జనరల్ కు కేటాయించారు. మొత్తం 27 స్థానాలలో 13 స్థానాలు మహిళలకు, 14 స్థానాలు జనరల్ కి కేటాయించినట్లు ప్రకటించారు. 
        
జిల్లాలోని 27 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) పదవులకు సంబంధించి  వేలేరుపాడు, జీలుగుమిల్లి మండలాలను షెడ్యూల్డ్ తెగలు మహిళలలకు, బుట్టాయిగూడెం, చింతలపూడి మండలాలను షెడ్యూల్డ్ తెగలు జనరల్ కు కేటాయించారు.  జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, టి. నర్సాపురం మండలాలను షెడ్యూల్డ్ కులములు మహిళలకు,అగిరిపల్లి, చాట్రాయి, పెదపాడు మండలాలను షెడ్యూల్డ్ కులాలు జనరల్ కు,, కేటాయించారు.  నూజివీడు మండలం వెనుకబడిన తరగతులు మహిళలకు, దెందులూరు , ఏలూరు మండలాలను వెనుకబడిన తరగతులు జనరల్ కు కేటాయించారు.  ద్వారకా తిరుమల,కామవరపుకోట, లింగపాలెం, ముసునూరు, నిడమర్రు, పెదవేగి, పోలవరం మండలాలు రిజర్వు కాని కేటగిరీలో కేటగిరీలో మహిళలకు, అదేవిధంగా భీమడోలు, కైకలూరు, కలిదిండి, కొయ్యలగూడెం, మండవల్లి, ముదినేపల్లి, ఉంగుటూరు, మండలాలు రిజర్వు కాని జనరల్ కు కేటాయించారు.
 
మండల పరిషత్ అధ్యక్ష పదవులకు రిజర్వేషన్ల వివరాలు :
 
జిల్లాలోని 27 మండల పరిషత్ అధ్యక్ష పదవులకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలకు 4 స్థానాలలో రెండు మహిళలకు, రెండు జనరల్ కు , షెడ్యూల్డ్ కులాలకు 6 స్థానాలలో మహిళలకు 3, జనరల్ కు 3, , వెనుకబడిన తరగతులకు 3 స్థానాలలో 1 మహిళలకు, 2 జనరల్ కు మిగిలిన 14 స్థానాలు రిజర్వు కాని కేటగిరీకి కేటాయించగా వాటిలో 7 స్థానాలు మహిళలకు, 7 స్థానాలు జనరల్ కు కేటాయించారు. మొత్తం 27 స్థానాలలో 13 స్థానాలు మహిళలకు, 14 స్థానాలు జనరల్ కి కేటాయించినట్లు ప్రకటించారు. 
           జిల్లాలోని 27 మండల పరిషత్ అధ్యక్ష పదవులకు సంబంధించి వేలేరుపాడు, జీలుగుమిల్లి మండలాలను షెడ్యూల్డ్ తెగలు మహిళలలకు, బుట్టాయిగూడెం,, కుక్కునూరు మండలాలను షెడ్యూల్డ్ తెగలు జనరల్ కు కేటాయించారు. చింతలపూడి, ద్వారకాతిరుమల, ముసునూరు మండలాలను షెడ్యూల్డ్ కులములు మహిళలకు, కామవరపుకోట, లింగపాలెం, పెదవేగి మండలాలను షెడ్యూల్డ్ కులాలు జనరల్ కు,, కలిదిండి మండలం వెనుకబడిన తరగతులు మహిళలకు, కైకలూరు, మండవల్లి మండలాలను వెనుకబడిన తరగతులు జనరల్ కు కేటాయించారు. అదేవిధంగా పోలవరం, భీమడోలు, చాట్రాయి, ఏలూరు, కొయ్యలగూడెం, ముదినేపల్లి, ఉంగుటూరు మండలాలు రిజర్వు కాని కేటగిరీలో మహిళలకు, అగిరిపల్లి, దెందులూరు, జంగారెడ్డిగూడెం, నిడమర్రు, నూజివీడు, పెదపాడు, టి.నర్సాపురం మండలాలు రిజర్వు కాని కేటగిరీలో జనరల్ కు కేటాయించారు.


              

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం