Eluru : జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వానికి మాగంటి పద్మావల్లీ దేవి మద్దతు అభ్యర్థన.. ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా జిల్లా ప్రజలు, కూటమి శ్రేణులకు సందేశం
ఏలూరు జిల్లా : ఏలూరు (స్వచ్ఛవార్త) :
ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని మాగంటి పద్మావల్లీ దేవి జిల్లా ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కోరారు. ఈ మేరకు ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా ఆమె తన సందేశాన్ని పంపిస్తూ, ప్రజల ఆశీస్సులు, మద్దతు కోరారు.
“ఏలూరు జిల్లా ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నమస్కారం. మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను. ఏలూరు జిల్లా జెడ్పీ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ పూర్తి మద్దతు అందించాలని కోరుతున్నాను. మీ ఆశీస్సులే నా బలం.. మీ మద్దతే నా గెలుపు” అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జిల్లా ప్రజలు, కూటమి శ్రేణులను ఉద్దేశించి ఈ సందేశాన్ని విడుదల చేశారు. ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రజలకు తెలియజేస్తూ, వారి సహకారం కోరారు.
