📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : రాజకీయ స్వలాభం కోసమే దళితుల్లో విభేదాలు : మత్తే బాబి ( ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త :

రాజకీయ స్వలాభం కోసం జిల్లాలో దళితుల మధ్య వైషమ్యాలు, విభేదాలు సృష్టించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వధర్మంలో ఒకలా, అధికారం పోయాక మరోలా వ్యవహరిస్తూ దళితులను మోసం చేసే ప్రవర్తనను తటస్థంగా ఉండే తమలాంటి వ్యక్తులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.  

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మత్తే బాబి మాట్లాడుతూ :    

గత ప్రభుత్వ హయాంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం, చీరాల కిరణ్, సుధాకర్, డాక్టర్ అనిత వంటి అనేక మంది దళితులపై దాడులు జరిగితే, అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. నాటి ముఖ్యమంత్రి జగన్‌‌పై కనీసం పోరాటం చేయనివారు, నేడు అధికారం కోల్పోయాక దళిత ఉద్ధారకులుగా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.  

అబద్ధపు ఆరోపణలతో రాజకీయం :

పాత బస్టాండ్ వద్ద విగ్రహాన్ని తొలగిస్తున్నారంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను మైండ్ గేమ్‌తో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాబి ఆరోపించారు. వేరే నియోజకవర్గాల్లో పనైపోయాక ఏలూరు వచ్చి, వైకాపా నాయకులను పోగేసుకుని ప్రెస్ మీట్లు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.  

ఎస్సీ కులాల అభివృద్ధి కమిటీ ఏర్పాటు :

బాబి ఒక్కడో, ఆంజనేయులు ఒక్కడో ఎదుగుతే కులమంతా ఎదిగినట్లు కాదని, ఎస్సీ కులాల్లోని ప్రతి వర్గానికి సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం జరగాలని స్పష్టం చేశారు. 62 డివిజన్లలో జనాభా దామాషా ప్రకారం రావాల్సిన వాటాను సాధించుకోవడానికే "ఎస్సీ కులాల అభివృద్ధి కమిటీ"ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ కమిటీ ఆధ్వర్యంలో హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతామని మత్తే బాబి ఉద్ఘాటించారు.


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం