Ghantasala : శ్రీకాకుళంలో పేకాట శిబిరం పై పోలీసుల దాడి.. రూ.5,230లు నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం
కృష్ణా జిల్లా : శ్రీకాకుళం : ఘంటసాల : స్వచ్ఛవార్త :
ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్ఐ చందన ఆధ్వర్యంలో పోలీసులు పేకాట శిబిరం పై దాడి చేసి తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి రూ.5,230ల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఎస్ఐ చందన్ మాట్లాడుతూ.. ఘంటసాల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, కోడి పందాలు, చిత్తులు, జూదాలు, ఇతర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైన ఇలాంటి సంఘటనలు జరిగే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
