Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్న సమారాధనకు 125 kg ల బియ్యం విరాళం
కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) :
శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ నెల 18న నిర్వహించనున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి మహాఅన్న సమారాధనకు గుడ్లవల్లేరుకు చెందిన అడుసుమిల్లి ప్రసాద్ (ప్రసాద్ పెయింట్స్) 125 కిలోల బియ్యం (5 కట్టలు) విరాళంగా సమర్పించారు. మహా అన్నసమారాధనకు వస్తు రూపంలోగానీ, ధన రూపంలోగానీ .. అందించదలచిన భక్తులు ఆలయ కార్యాలయంలో సమర్పించి తగిన రసీదు పొందాలని.. అలాగే, ఆన్లైన్ ద్వారా కూడా విరాళాలు సమర్పించ వచ్చని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బియ్యం విరాళంగా అందించిన అడుసుమిల్లి ప్రసాద్‌ను దేవస్థానం చైర్మన్ ఈడే వెంకట విష్ణుమోహన్‌రావు, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్లేపల్లి సగుణ శేఖర్, పెన్నేరు శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు శాలువాతో సత్కరించి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.

