📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : శ్రీ కొండలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. 15 వేల మందికి పైగా దర్శనం

కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు, వేమవరం (స్వచ్ఛవార్త) :

మండలంలోని వేమవరం గ్రామంలో కొలువైన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి పాలపొంగళ్లను సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యంతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు చేపట్టినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు వడ్లమూడి రవీంద్రబాబు, కళ్లేపల్లి సుగుణశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గుడ్లవల్లేరు ఎస్సై కొండపల్లి సురేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం