Gudlavalleru : 18న కొండలమ్మ ఆలయంలో 30 వేల మంది భక్తులకు మహా అన్నదానం.. విరాళాలు అందించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి
కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త)
మండలంలోని వేమవరం గ్రామంలో భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా విరాజిల్లుతున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ నెల 18వ తేదీ ఆదివారం 30 వేల మంది భక్తులకు మహా అన్నసమారాధన నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆకుల కొండలరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మహా అన్నసమారాధనకు భక్తులు వస్తు రూపంలో గానీ, ధన రూపంలో గానీ విరాళాలు అందించి సహకరించాలని.. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా విరాళాలు అమ్మవారికి అందించవచ్చని ఆలయ కమిటీ కోరింది. విరాళాలు అందించదలచిన వారు దేవస్థానం వద్ద సమర్పించి తగిన రసీదు పొందాలని సూచించింది.
కార్యక్రమానికి భక్తులు, దాతలు తమ వంతు సహకారం అందించి అమ్మవారి సేవలో భాగస్వాములు కావాలని ఆలయ చైర్మన్ ఈడే మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు.

