📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : శ్రీ కొండలమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.27.82 లక్షలు

కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు, వేమవరం (స్వచ్ఛవార్త) :

మండలంలోని వేమవరం గ్రామంలో కొలువైన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థాన హుండీలను 64 రోజుల అనంతరం లెక్కించారు. నోట్ల రూపంలో రూ.25,16,520, చిల్లర రూపంలో రూ.2,65,747 కలిపి మొత్తం రూ.27,82,267 ఆదాయం సమకూరింది. అమ్మవారి అన్నదానం హుండీ ద్వారా నోట్ల రూపంలో రూ.59,660, చిల్లర రూపంలో రూ.4,620 లభించాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉదయం 9 గంటలకు తనిఖీదారు, సూపర్‌వైజర్ మచిలీపట్నం కె. శ్రీనివాసరావు పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, సభ్యులు కళ్లేపల్లి సుగుణశేఖర్, మన్నెం వీర నాగేంద్రరావు, ముంగం ఆంజనేయులు, తూము రాజ్యలక్ష్మి, నూతలపాటి లక్ష్మీ పావని, పెన్నేరు వీర వెంకట నాగ లీల శేఖర్, ఈవో ఆకుల కొండలరావు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, ఉయ్యూరు, గుడ్లవల్లేరు, వేమవరం సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు :

ఇదిలా ఉండగా, ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక, వాల్ పోస్టర్‌ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టీడీపీ సీనియర్ నాయకుడు చేకూరి జగన్ మోహన్‌రావులకు దేవస్థాన చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో ఆకుల కొండలరావు, ముఖ్య అర్చకులు, ఎక్స్‌అఫీషియో సభ్యుడు రుద్రపాక శరశ్చంద్ర శివ సంతోష్ కుమార్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా వారిని సాంప్రదాయబద్ధంగా శాలువాతో సత్కరించారు.అమ్మవారి సన్నిధిలో వరుణయాగం, వరుణజపం :

దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ వరుణయాగం, వరుణజపం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ఈవో ఆకుల కొండలరావు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం