Gudlavalleru : వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి అన్నప్రసాద వితరణకు సీతారాం పృథ్వీ సహకారం
కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) :
మండలంలోని వేమవరంలో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 18న నిర్వహిస్తున్న మహా అన్నప్రసాద వితరణకు శనివారం గుడ్లవల్లేరుకు చెందిన పడవల వెంకటేశ్వరరావు కుమారుడు సీతారాం పృథ్వీ అన్నప్రసాదానికి 125 కిలోల బియ్యం అందించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నప్రసాద వితరణకు సహకరించిన దాతలను దేవస్థానం చైర్మన్ ఈడే మోహన్, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమానికి దాతలు అందిస్తున్న సహకారం పట్ల దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
మహా అన్నసమారాధనకు భక్తులు వస్తు రూపంలో గానీ, ధన రూపంలో గానీ విరాళాలు అందించి సహకరించాలని... అలాగే ఆన్లైన్ ద్వారా కూడా విరాళాలు అమ్మవారికి అందించవచ్చని ఆలయ కమిటీ కోరింది. విరాళాలు అందించదలచిన వారు దేవస్థానం వద్ద సమర్పించి తగిన రసీదు పొందాలని సూచించింది.
