Gudlavalleru : శ్రీ కొండలమ్మ ఆలయంలో దసరా నవరాత్రులు సందర్భంగా ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు
- ప్రతిరోజూ ఉచిత ప్రసాద వితరణ.. భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు
కృష్ణాజిల్లా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) :
మండలంలోని వేమవరంలో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, భక్తులకు కల్పించనున్న సౌకర్యాల వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వివరించారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి నవరాత్రుల ఏర్పాట్లను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆమె అనుగ్రహం పొందాలని కోరారు.
దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాలక్షేప మండపాన్ని ప్రారంభించడంతో పాటు తాత్కాలిక పందిళ్లు, లైటింగ్ ఏర్పాట్లు చేపడుతున్నట్లు వివరించారు.
నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్ళేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, మన్నెం వీర నాగేంద్రరావు, ముంగం ఆంజనేయులు, నూతలపాటి లక్ష్మీ పావని, పెన్నేరు వీర వెంకట నాగ లీల శేఖర్, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ముఖ్య అర్చకుడు ఆర్.ఎస్.సి.ఎస్. సంతోష్ శర్మ పాల్గొన్నారు.
