📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : నేటి నుంచి కొండలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

  • ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలశ స్థాపన.. నూతన పట్టు వస్త్రాల సమర్పణ
  • ఉదయం 11.09 గంటలకు కాలక్షేప మండపం ప్రారంభోత్సవం

కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు/ వేమవరం (స్వచ్ఛవార్త) :

శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం (అక్టోబర్ 11) నుంచి ఈ నెల 20వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆదివారం ఉదయం 9.26 గంటలకు చిత్తా నక్షత్రం, వృశ్చిక లగ్నంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా కలశ స్థాపన జరగనుంది. దసరా సందర్భంగా ఆయన అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించనున్నారనీ ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతరం ఉదయం 11.09 గంటలకు శ్రీ కొండలమ్మ అమ్మవారి కాలక్షేప మండపాన్ని ప్రారంభించనున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పది రోజుల పాటు ఆలయం చుట్టూ కోళ్లు, గొర్రెలు, పోతులను తిప్పడం నిషేధించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ నిబంధనను పాటించి ఉత్సవాలకు సహకరించాలని కోరారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం