Gudlavalleru : కొండలమ్మ అమ్మవారి అన్నప్రసాద వితరణకు కమ్మిలి వెంకట మోహన్ రావు దంపతుల సహకారం
- దాతలను శేషవస్త్రంతో సత్కరించిన ఆలయ చైర్మన్ ఈడే మోహన్
కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) :
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు శుక్రవారం గుడ్లవల్లేరు మండలం పెసరమిల్లి గ్రామానికి చెందిన కమ్మిలి వెంకట మోహన్ రావు దంపతులు సహకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నప్రసాద వితరణకు సహకరించిన దాతలను దేవస్థానం చైర్మన్ ఈడే మోహన్, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమానికి దాతలు అందిస్తున్న సహకారం పట్ల దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మన్నెం వీర నాగేంద్రరావు, కళ్ళేపల్లి సుగుణ సోమశేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, పెన్నేరు శేఖర్, నూతలపాటి లక్ష్మీ పావని, ముంగం ఆంజనేయులు, ఉస్తెల కోటేశ్వరమ్మ, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఆర్.ఎస్.సి.ఎస్. సంతోష్ శర్మ (శివయ్య) పాల్గొన్నారు.

