📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : వైభవంగా శ్రీ కొండలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

  • కలశ స్థాపన చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ..
  • ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రత్యేక పూజలు..
  • కాలక్షేప మండపం ప్రారంభం.. 

కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) :

వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉదయం 9.26 గంటలకు చిత్తా నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. 

అనంతరం ఉదయం 11.09 గంటలకు అమ్మవారి కాలక్షేప మండపాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో నిర్వహించిన పూజలు, భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇతర వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

బాలాత్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం :

శరన్నవరాత్రుల తొలిరోజు అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 8.45 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించిన అనంతరం కలశ స్థాపన, ఆవాహన, పీఠార్చన, దీక్షాధారణ, సహస్రనామార్చన, అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలు చేపట్టారు. సమస్త కార్యజయ సిద్ధికి, నవగ్రహ దోష పరిహారానికి శ్రీ లక్ష్మీ గణపతి సహిత నవగ్రహ హవనాలు, అమ్మవారి మూలమంత్ర హవనాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మచిలీపట్నానికి చెందిన క్లాత్‌ మర్చంట్ గజ్జల గంగరాజు భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందజేశారు.1

అమ్మవారిని దర్శించుకున్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల :

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ముఖ్య అర్చకుడు ఆర్.ఎస్.సి.ఎస్. సంతోష్ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. పూజల అనంతరం శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.

అక్టోబర్ 18న మహా అన్నసమారాధన : 

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18వ తేదీన దేవస్థానంలో మహా అన్నసమారాధన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు నగదు లేదా వస్తు రూపంలో విరాళాలు అందించి సహకరించవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. విరాళాలు అందించే భక్తులు దేవస్థానం వద్ద రసీదు పొందాలని సూచించారు.

భజన బృందాలకు ధ్రువపత్రాల ప్రదానం :

ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 1 గంటకు గుడ్లవల్లేరుకు చెందిన శ్రీ శివ సాయి రామ్ ఆర్కెస్ట్రా గానాలహరి బృందం భజన కార్యక్రమాన్ని నిర్వహించింది. మధ్యాహ్నం 3 గంటలకు వడ్లమన్నాడుకు చెందిన శ్రీ వేణుగోపాల భక్త సమాజం భజనలు ఆలపించింది. ఈ రెండు బృందాలకు దేవస్థానం తరఫున ధ్రువపత్రాలు అందజేశారు. శ్రీ శివ సాయి రామ్ ఆర్కెస్ట్రా గానాలహరి బృందానికి ఆలయ చైర్మన్, కార్యనిర్వహణాధికారి ధ్రువపత్రం అందించగా, శ్రీ వేణుగోపాల భక్త సమాజానికి చైర్మన్ ఈడే మోహన్, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ధ్రువపత్రాన్ని అందించారు.

సాయంత్రం 5.30 గంటల నుంచి సాయంకాలార్చన, ఉంజల్ సేవ, పంచహారతులు, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రాత్రి 7.30 గంటలకు మచిలీపట్నానికి చెందిన శ్రీ బాలాత్రిపుర సుందరీ నృత్యనికేతన్ కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. రాత్రి 8.30 గంటలకు ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ నాటకంలోని రాముడి సన్నివేశాన్ని ప్రదర్శించారు. రాత్రి 10 గంటలకు రెడ్డిపాలెంకు చెందిన జై శ్రీ ఆదర్శ కళానాటక మండలి వారు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం జీవిత చరిత్ర ఆధారంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు.

కార్యక్రమాల్లో టీడీపీ సీనియర్ నాయకుడు చేకూరి జగన్ మోహనరావు, గుడివాడ జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మండల అధ్యక్షుడు పోలవరపు వెంకట్రావు, టీడీపీ నాయకులు కొడాలి రామరాజు, వెనిగళ్ల నాగేశ్వరరావు, మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం చౌదరి, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

శ్రీ కొండలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం