📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Jeelugumilli : ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం

ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి (స్వచ్ఛవార్త) :

ద్వారకాతిరుమల శ్రీ చిన్న వెంకన్న దేవస్థానం దత్తత ఆలయమైన ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన సుదర్శన హోమంలో జనసేన నాయకులు గడ్డమణుగు రవికుమార్, కరాటం సాయి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆలయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మరింత అభివృద్ధి చెంది భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

పోలవరం నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. మహిమాన్వితమైన లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సుదర్శన హోమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. 

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం