Jeelugumilli : గౌడ సంఘ పెద్దల కుటుంబాలకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శ
ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి (స్వచ్ఛవార్త) :
జీలుగుమిల్లికి చెందిన గౌడు సంఘ పెద్దలు ఉలవల ముత్యం కుమారుడు ఉలవల రామకృష్ణ రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం పట్ల పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విచారం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో శనివారం జీలుగుమిల్లిలోని ఉలవల రామకృష్ణ నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, చిర్రి కృష్ణయ్య, మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, రూపా సత్యనారాయణ, కూరం వెంకటేష్, రాయి సుబ్బారావు, చిర్రి వెంకటేశ్వరరావు, ఉలవల శివ తదితరులు పాల్గొన్నారు.
