Kaikaluru : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం
- బీసీల రాజకీయ అభ్యున్నతికి కృషి చేసింది టీడీపీయే..
- వైకాపాపై టీడీపీ కన్వీనర్ కొత్త నాగేంద్ర కుమార్ (నాగబాబు) విమర్శలు..
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని అడ్డుకునేందుకు వైకాపా కోర్టులను ఆశ్రయించడం బీసీలకు తీరని అన్యాయం చేయడమేనని తెలుగుదేశం పార్టీ కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ కొత్త నాగేంద్ర కుమార్ (నాగబాబు) విమర్శించారు.
కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
బీసీలను రాజకీయంగా బలోపేతం చేసి, రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నాగేంద్ర కుమార్ అన్నారు. బీసీలకు ఉన్నత విద్య, రాజకీయ అవకాశాలు కల్పించడంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
బీసీల ప్రయోజనాలకు వైకాపా వెన్నుపోటు పొడిచిందని ఆయన ఆరోపించారు. అమర్నాధ్ గౌడ్ హత్య కేసులో నిందితులకు వైకాపా అండగా నిలిచిందని విమర్శించారు.
బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కృషి చేస్తామని కొత్త నాగేంద్ర కుమార్ స్పష్టం చేశారు.
మాజీ శాసనమండలి సభ్యులు, కో కన్వీనర్లు వల్లభనేని శ్రీనివాస చౌదరి, బొప్పన సుందర రామయ్య, కమ్మిలి విఠల్ రావు, ఏఎంసి ఛైర్మన్లు పెన్మత త్రినాథరాజు, కూరేళ్ల ఏడుకొండలు, పొలవరపు లక్ష్మీ రాణి, పడమట వాసు, ఏడుకొండలు, తాతారావు, రామస్వామి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
