📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : వాతావరణ మార్పులకు అనుగుణంగా చేపల పెంపకంపై కైకలూరులో మత్స్య రైతులకు శిక్షణ.. అవగాహన సదస్సులో పాల్గొన్న అండ్రరాజు శ్రీనివాసరావు

ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) :

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపల పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, ఆర్థిక అవకాశాలు, బీమా సౌకర్యాలపై సమాచారం అందించడమే లక్ష్యంగా కైకలూరులో చిన్నకారు మత్స్య రైతులకు ఒకరోజు శిక్షణ, అవగాహన సదస్సును గురువారం స్థానిక మత్స్యశాఖ కార్యాలయంలో నిర్వహించారు. గోవాలోని ఐసీఏఆర్–సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐసీఏఆర్–సీసీఏఆర్‌ఐ) సౌజన్యంతో కైకలూరులోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.

‘వాతావరణ ఆధారిత చేపల పెంపకం–ఆర్థిక అక్షరాస్యత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వాతావరణ మార్పులకు అనుగుణంగా చేపల పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఆధునిక మెళకువలు, రైతులకు అందుబాటులో ఉన్న ఆర్థిక అవకాశాలు, బీమా సౌకర్యాలపై నిపుణులు వివరించారు.

సదస్సులో ఐసీఏఆర్–సీసీఏఆర్‌ఐ గోవా శాస్త్రవేత్త డాక్టర్ త్రివేష్ సురేష్ మయేకర్, కేవీకే వెంకటరామన్నగూడెం శాస్త్రవేత్త డాక్టర్ దేవి వరప్రసాద్ రెడ్డి, కేవీకే ఉండి శాస్త్రవేత్త శ్రీనివాస అప్పన్న, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి శ్రీ సత్య సాంకేతిక అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. 

కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ..

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపల పెంపకంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ నిపుణుల సూచనలను పాటించడం ద్వారా చేపల పెంపకంలో ఎదురయ్యే నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆర్థిక, బీమా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు శ్రీనివాసరావు, సిహెచ్. గణపతి, గ్రామ మత్స్య సహాయకులు (వీఎఫ్‌ఏలు), స్థానిక ఆక్వా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం