Kaikaluru : పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. కామినేని భూమి పూజలు
ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) :
పల్లె పండగ–3.0 కార్యక్రమంలో భాగంగా సోమవారం కైకలూరు మండలంలోని శృంగవరప్పాడు, పందిరిపల్లిగూడెం, పెంచికలమర్రు, కొట్టాడ గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కైకలూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ ఆదివారం భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ పనులతో ఆయా గ్రామాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొత్తా నాగేంద్ర కుమార్ (నాగబాబు), జనసేన నాయకుడు కొల్లి బాబి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు రాధాకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు భలే యేసు రాజు, ఆయా గ్రామాల సర్పంచులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
