Kaikaluru : కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జయమంగళ ప్రచారం
- కూటమి అభ్యర్థుల విజయానికి ఓటర్లను అభ్యర్థించిన ఎమ్మెల్సీ జయమంగళ
- పల్లెవాడ, పెరికేగూడెం, మండవల్లిలో ఎన్నికల ప్రచారం
ఏలూరు జిల్లా : కైకలూరు/మండవల్లి (స్వచ్ఛవార్త) :
కైకలూరు నియోజకవర్గంలోని పల్లెవాడ, పెరికేగూడెం, మండవల్లి గ్రామాల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓట్లను వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కైకలూరు మండలం పల్లెవాడ గ్రామంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భలే యేసు రాజు, ఎంపీటీసీ అభ్యర్థి ఘంటసాల విజయలక్ష్మికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జడ్పీటీసీకి సైకిల్ గుర్తుపై, ఎంపీటీసీకి గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మండవల్లి మండలం పెరికేగూడెం గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ శంకరరావు, ఎంపీటీసీ అభ్యర్థి పెరుమాళ్ల సీతకు మద్దతుగా ప్రచారం చేశారు. రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
మండవల్లి గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ శంకరరావు, మండల పరిషత్ అధ్యక్ష అభ్యర్థి పల్లపోతు సహదేవుడికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
