📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : ఘనంగా పోసిన చెంచు రామారావు జన్మదిన వేడుకలు.. పేదలకు అన్నదానం.. రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ

ఏలూరు జిల్లా : కలిదిండి (స్వచ్ఛవార్త) :

రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నాయకుడు పోసిన చెంచు రామారావు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య ఆయన పలు గ్రామాల్లో జరిగిన వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు కైకలూరు నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం, పండ్లు, రొట్టెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఉదయం కలిదిండి గ్రామంలోని తన స్వగృహంలో అభిమానులు, శ్రేయోభిలాషులకు చెంచు రామారావు అందుబాటులో ఉన్నారు. అనంతరం కలిదిండి మండలం గురవాయిపాలెం పంచాయతీ పరిధిలోని మద్దావానిగూడెంలో నిర్వహించిన పరిశుద్ధ సిలువ ప్రతిష్ఠ 32వ వార్షిక మహోత్సవంలో పాల్గొన్నారు. కైకలూరు మండలం తామరకొల్లులో మదర్ థెరిసా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. సాయంత్రం ఎస్‌ఆర్‌పీ అగ్రహారంలో జరిగిన వేడుకల్లో పాల్గొని, కలిదిండి మెయిన్ సెంటర్‌లో కేక్ కట్ చేశారు. అనంతరం బద్రిరాజు కాంప్లెక్స్ వెనుక ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో గౌడ సంఘ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలుసుకున్నారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

రోగులకు, పేదలకు సేవా కార్యక్రమాలు :

చెంచు రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. అనంతరం కైకలూరు ఎస్టీ కాలనీలో పేదలకు రొట్టెలు, పండ్లు అందజేశారు. లోకుమూడి దత్తాశ్రమంలో కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం నాయకుడు పరసా వీర్రాజు, కైకలూరు నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షుడు పోలగాని నాగరాజు మాట్లాడుతూ, జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. పేదలకు అండగా నిలుస్తూ అన్నదానం, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సంఘ నాయకులు మాడెం కృష్ణారావు, అల్లూరి మంగారావు, బొర్రా సత్యనారాయణ, పరిసే రాణి, సింహాద్రి కేదార్, వీరంకి సత్యనారాయణ, దాసరి శ్రీనివాస్, చిల్లి ముంత నాగబాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలువురు నాయకులు, అభిమానులు చెంచు రామారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం