📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : కామినేని ప్రచార జోరు.. ప్రత్యర్థుల్లో టెన్షన్

ఏలూరు జిల్లా : కలిదిండి (స్వచ్ఛవార్త) :

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలిదిండి మండలంలో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం ముమ్మరగా సాగుతుంది. శనివారం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని .శ్రీనివాస్ కూటమి పార్టీ అభ్యర్థులతో మూలలంక నుంచి కోరుకొల్లు వరకు భారీ ర్యాలీ తో పర్యటించి కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. జడ్పిటిసి అభ్యర్థి నల్లగోపుల. చలపతిరావు, ఎంపీపీ అభ్యర్థి గొరిపర్తి. వెంకట నరసమ్మ లకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్ కామినేని మాట్లాడుతూ.. 

నాయకులు కార్యకర్తలతో కలసి ప్రజలను కలుసుకొని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామాలలో నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేస్తూ వారి విజయానికి కృషి చేయాలని కోరారు.

మూలలంక, భాస్కరరావుపేట, సంతోషపురం, అమరావతి, గురవాయిపాలెం, కలిదిండి, పడమటి పాలెం, సానా రుద్రవరం, ఎస్ఆర్పి అగ్రహారం, కోరుకొల్లు గ్రామాల వరకు ఆయా గ్రామాలలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు గాజు గ్లాస్, సైకిల్ గుర్తులపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కామినేని పర్యటనతో స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. అభ్యర్థుల విజయానికి సమిష్టి కృషి చేయాలని కోరారు. 

ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సిహెచ్. చంద్రశేఖర్,టిడిపి మండల పార్టీ అధ్యక్షులు వల్లభనేని. శ్రీనివాస చౌదరి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పోకల. జోగిరాజు, డిసి చైర్మన్ ముద్దం. భోగేశ్వర రావు, అగ్నికుల, నాయి బ్రాహ్మణ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ లు ఆండ్రాజు. శ్రీనివాస్, లంక. రత్తయ్య అన్నవరం దేవస్థానం బోర్డ్ డైరెక్టర్ బండి. లక్ష్మి, తులసిరావు, సారిక. వెంకటేశ్వరరావు, మూలలంక ఎంపీటీసీ అభ్యర్థి మునకాల. త్రివేణి ప్రభ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం