📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kamavarapukota : పిడుగుపాటుకు జీలకర్రగూడెంలో పాడి గేదె మృతి


ఏలూరు జిల్లా : కామవరపుకోట (స్వచ్ఛవార్త) :

అకాల వర్షంతో పాటు పిడుగు పడి జీలకర్రగూడెంలో సోమవారం పాడి గేదె మృతి చెందింది. బాహుబలేంద్రుని మోహన్‌సింగ్‌కు చెందిన గేదె వద్ద పిడుగు పడడంతో సంఘటన స్థలంలోనే గేదె మృతి చెందింది. తాను గేదెలను మేపుకుంటూ పాడి మీదే జీవిస్తోన్న మోహన్‌సింగ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

గేదె విలువ రు. 2 లక్షలు ఉంటుందని రైతు తెలిపారు. తాజా మాజీ సర్పంచ్‌ ఘోరింక దాసుతో పాటు టీడీపీ సీనియర్‌ నాయకులు కంఠమనేని అంజిమూర్తి సంఘటన స్థలానికి వెళ్లి రైతు మోహన్‌సింగ్‌కు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అక్కడ నుంచే వీఆర్వోతో పాటు పశువైద్య శాఖ అధికారికి తెలియజేశారు. పశు వైద్యులు పంచినామానంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయనున్నట్లు చెప్పారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం