📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

K.kota : కె. కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు

ఏలూరు జిల్లా : కామవరపుకోట (స్వచ్ఛవార్త) : 

స్థానిక కామవరపుకోట ప్రభుత్వ  డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు  సూచనలు, కళాశాల ఉన్నత విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం శనివారం రాజనీతి శాస్త్రం, ఎన్. ఎస్. ఎస్ విభాగముల సంయుక్త ఆధ్వర్యంలో "జాతీయ ఐక్యతా దినోత్సవం" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. మధు వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. 

అనంతరం ఇంఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్  ఎం మధు  ప్రసంగిస్తూ స్వతంత్ర భారతదేశంలోని అనేక సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతదేశ నిర్మాణంలో పటేల్ ఎంతో కృషి చేశారని పటేల్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు ధారావతు మల్లేష్ ప్రసంగిస్తూ పటేల్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో  ఐక్యత ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది.

కార్యక్రమంలో ఇంఛార్జి  ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం మధు అధ్యాపకులు కె మహేష్ బాబు, ఎస్ సుశ్యలత, ధారావతు మల్లేష్, ఎం విజయ కృష్ణ, పి. కల్పనతో పాటు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం