📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : మచిలీపట్నంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు.. అక్టోబర్ 9 వరకు విధులు బహిష్కరణకు పిలుపు

కృష్ణాజిల్లా : మచిలీపట్నం (స్వచ్ఛవార్త) :

ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న" అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్" తక్షణమే అమలు తీసుకురావాలని జూనియర్ న్యాయవాదులకి హామీగా ఇచ్చిన 10,000 రూపాయలు వెంటనే చెల్లించాలని కోరుతూ మచిలీపట్నం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు ముందు రిలే నిరాహారదీక్ష శిబిరాలు ప్రారంభించారు. 

అక్టోబర్ 9 వరకు విధులు బహిష్కరణకు పిలుపునిచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు తుంగల హరిబాబు, కార్యదర్శి సర్వ లలిత కుమారి తో పాటు సీనియర్ అడ్వకేట్లు జీ.వీ.ఎల్ నరసింహారావు, కొండపల్లి వేణు, పి సూర్యప్రకాష్, తోట శంకర్, పి.వి. వెంకటేశ్వరరావు తో పాటు పలువురు న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. 

న్యాయవాదుల సంరక్షణ చట్టం అమల్లోకి తీసుకురావాలని జూనియర్ న్యాయవాదులకు పదివేల రూపాయలు స్టాఫ్ అండ్ చెల్లించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. బంటుమిల్లి, కైకలూరు గుడివాడ బార్ అసోసియేషన్ కూడా విధులు బహిష్కరణ పిలుపునిచ్చాయి. అక్కడ కూడా నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. 

మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ.. 

న్యాయవాదులకి ప్రాణ రక్షణ కరువైందని అనేక జిల్లాల్లో జరుగుతున్న దాడులు ఇందుకు ఉదాహరణగా ఉన్నాయని, తక్షణమే రాష్ట్ర అసెంబ్లీలో న్యాయవాదుల రక్షణ చట్టం కి ఆమోదం తెలియచేయాలని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను బాలాజీ కోరారు.

కూటమి ప్రభుత్వం రాగానే జూనియర్ న్యాయవాదులకు పది వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తానన్న విషయం తెరమరుగయి పోయిందని.. వెంటనే దీన్ని అమలు చేయాలని బాలాజీ అన్నారు. న్యాయవాదులు చేస్తున్న ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు తెలియజేస్తుందని కూటమి నాయకులకు ఈ విషయంపై సమాచారమిచ్చి చట్టం తీసుకురావడానికి కృషి చేస్తామని నగర జనసేన పార్టీ అధ్యక్షులు గడ్డం రాజు,రాష్ట్ర బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి ఫణికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ, గుడివాడ అవనిగడ్డ కు చెందిన న్యాయవాదులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.అడ్వకేట్ లావణ్య,విజయవాడ మహిళా సంఘం కార్యదర్శి ఇసంశెట్టి ఉషాజ్యోతి సంఘీభావం తెలియజేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం