📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి.. డీపీఓకు ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ వినతి

కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ (స్వచ్ఛవార్త ) :

పంచాయతీ కార్యదర్శుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ కృష్ణాజిల్లా అధ్యక్షులు జి. గోపిచంద్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారిని కలిసి సంఘం తరఫున వినతిపత్రం అందజేశారు.

ఒకే క్యాడర్‌లో ప్రమోషన్ లేకుండా ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అర్హత కలిగిన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-V, VI ఉద్యోగులను గుర్తించి ప్రభుత్వం మంజూరు చేసిన ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS)ను వెంటనే అమలు చేయాలని కోరారు. రీ-క్యాటగరైజేషన్‌లో భాగంగా పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (PDO) గ్రేడ్-IIIల క్యాడర్ స్ట్రెంత్‌ను పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే జీవో నెం.60 ప్రకారం PDO గ్రేడ్-III ఉద్యోగులకు రూ.28,280 పే స్కేల్ వర్తించేలా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గోపిచంద్ కోరారు.

సంఘం అందించిన వినతిపత్రాలపై జిల్లా పంచాయతీ అధికారి స్పందిస్తూ AAS అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, క్యాడర్ స్ట్రెంత్, పే స్కేల్‌కు సంబంధించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం