Machilipatnam : నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాల సేకరణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి – జిల్లా ఎస్పీ విద్యాసాగర్
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడుతో కలిసి సాధారణ తనిఖీల్లో భాగంగా ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం, మెజర్మెంట్ కలెక్షన్ యూనిట్ (MCU) ,విభాగాలను సందర్శించి, సిబ్బంది విధులు, రికార్డుల నిర్వహణ, పరికరాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందికి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
▪️అనుమానితులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, వలస వచ్చిన వారి వివరాలను నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు నమోదు చేసి, అవసరమైన ఫింగర్ ప్రింట్ రికార్డులను భద్రపరచాలి.
▪️నేరస్థలంలో లభించే ప్రతి ఆధారాన్ని అత్యంత జాగ్రత్తగా సేకరించి, ఎలాంటి నష్టం లేదా పాడు కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో భద్రపరచాలి.
▪️సేకరించిన ఆధారాలకు సంబంధించిన రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ, అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారులకు తక్షణమే అందుబాటులో ఉండేలా చూడాలి.
▪️పెండింగ్ కేసులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్, క్లూస్ నివేదికలను త్వరితగతిన పూర్తి చేసి, కేసుల దర్యాప్తులో కీలక సహకారం అందించాలి.
▪️ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న పరికరాలను సమర్థవంతంగా వినియోగిస్తూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.
అనంతరం సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణకు అవసరమైన సౌకర్యాల కల్పనపై సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలు అత్యంత కీలకమని, ప్రతి అధికారి, సిబ్బంది పూర్తి బాధ్యతతో, సమన్వయంతో పనిచేస్తూ నేర నిరూపణకు దోహదపడాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బందరు డిఎస్పి ఏ.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి. వెంకటేశ్వరరావు, ఫింగర్ ప్రింట్,క్లూస్ టీం ఎస్ఐ త్రివర్ణ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
