Mudinepalli : ముదినేపల్లి ఎస్సైగా సూర్యశ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) :
ముదినేపల్లి పోలిస్టేషన్ ఎస్సైగా టీ. సూర్యశ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో చిలకల్లు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ముదినేపల్లికి వచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటానని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
