📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Nagayalanka : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం

కృష్ణా : నాగాయలంక (స్వచ్ఛవార్త) :

పల్లె పండుగ కార్యక్రమం గ్రామాలకు నిజమైన పండుగ తెస్తోందని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని భావదేవరపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గ్రామంలో ఎంపీపీ స్కూల్ వద్ద నుంచి జెడ్పీ హైస్కూల్, ఎంవీకే ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ మీదుగా ఎస్టీ కాలనీ వరకు నూతనంగా 600 మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి పల్లె పండుగ-3.0 భాగంగా వీబీజీ రాంజీ నిధులు రూ.40 లక్షలు మంజూరు అయిన సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదుకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు విద్యాలయాల విద్యార్థులకు, నిరుపేద ఎస్టీలకు పటిష్టమైన సీసీ రోడ్డు మంజూరు చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ.. పల్లె పండుగ-3.0 కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కృషితో నియోజకవర్గానికి రూ.17,18,35,000లు మంజూరు అయినట్లు వివరించారు. తద్వారా నియోజకవర్గంలో అనేక రహదారులు అభివృద్ధి కానున్నట్లు తెలిపారు. 

జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్లు ముమ్మారెడ్డి శ్రీనివాసరావు, తోట శ్రీనివాసరావు, కూటమి నాయకులు బండ్రెడ్డి హరి, భోగాది శివవిష్ణు, ముమ్మారెడ్డి శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షులు బండ్రెడ్డి నీలాంబరరావు, కూనపరెడ్డి నాగమల్లేశ్వరరావు, మాదివాడ అర్జునరావు, పెద్దసంఖ్యలో జనసైనికులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం