📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Narasaraopet : స్వాతంత్య్ర సమరయోధుడు ఒడ్డు ఓబన్న సేవలు చిరస్మరణీయం.. విగ్రహావిష్కరణలో ఎమ్మెల్సీ జయమంగళ

నరసరావుపేట/కైకలూరు (స్వచ్ఛవార్త) :

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు ఒడ్డు ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనమండలి సభ్యుడు చంద్రగిరి యేసురత్నం తదితర ప్రముఖులు పాల్గొన్నట్లు ఎమ్మెల్సీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ.. 

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఒడ్డు ఓబన్న వంటి మహనీయుల జీవిత చరిత్రను యువత తెలుసుకోవడం ద్వారా దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను గౌరవిస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యుడు, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్ రావు, రాయపాటి అరుణ, మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవుళ్ళ, జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రమణ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం