📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Rajamahendravaram : ఏసీబీ వలలో అగ్నిమాపక అధికారి.. రూ.65 వేల లంచం తీసుకుంటూ


ఐదు బాణాసంచా దుకాణాలకు ఫైర్ ఎన్‌ఓసీల పేరుతో రూ.75 వేలు డిమాండ్‌

తూ. గో జిల్లా :రాజమహేంద్రవరం ( స్వచ్ఛవార్త) :

ఐదు బాణాసంచా దుకాణాలకు ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేయడంతో పాటు, దుకాణాల తనిఖీల కోసం లంచం తీసుకుంటూ రాజమహేంద్రవరం సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి (ఏడీఎఫ్‌ఓ) పి. శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రూ.75 వేలు డిమాండ్ చేయగా, చివరకు రూ.65 వేలు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడు ఐదు బాణాసంచా దుకాణాలను నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన పెసో (PESO) లైసెన్సులు 2028, 2035 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉన్నాయి. రాబోయే దీపావళి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక దుకాణాలకు ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న దుకాణాల తనిఖీల కోసం ఒక్కో దుకాణానికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.75 వేలు ఇవ్వాలని ఏడీఎఫ్‌ఓ శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.

చివరకు రూ.65 వేలు ఇచ్చేందుకు అంగీకరించడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ అధికారులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం 6.44 గంటలకు కోటిపల్లి బస్‌స్టాండ్ సమీపంలోని కార్యాలయంలో వల పన్నారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.65 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి కుడిచేతి వేళ్లకు నిర్వహించిన ఫినాఫ్తలీన్ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అనంతరం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి :

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు లేదా ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అదనపు పోలీసు సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేశారు.

ఈ దాడిలో ఏసీబీ అదనపు ఎస్పీ ఎస్. భావ్య కిషోర్, ఇన్‌స్పెక్టర్లు ఎన్.వి. భాస్కరరావు, డి. వాసుకృష్ణ, వై. సతీష్, కె. గోవిందరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.


— అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), రాజమహేంద్రవరం రేంజ్

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం