📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

T. Narasapuram : ఎన్నికల షెడ్యూల్ పై అవగాహన సదస్సు


ఏలూరు జిల్లా : టి. నరసాపురం,(స్వచ్ఛవార్త) :

మండల ప్రజా పరిషత్ పరిధిలో త్వరలో జరుగనున్న మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల షెడ్యూలు వివరములను మండల పరిధిలో గల గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలకు అవగాహన నిమిత్తం ఆదివారం రిటర్నింగ్ అధికారి మండల ప్రజాపరిషత్ టి. నరసాపురం వారిచే మండల ప్రజా పరిషత్ కార్యాలయములో సమావేశము నిర్వహించబడినది.

ఈ సమావేశములో ఎన్నికల సంఘం వారిచే ఎన్నికల షెడ్యూలు విడుదల కాబడియునందున మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు అమలులో ఉన్న విషయము తెలియచేయడమైనది. అదే విధముగా ఎన్నికలలో పోటీ చేయు అబ్యర్ధులు ఖర్చుచేయదగు మొత్తములను వివరించడమైనది. మరియు మండల పరిధిలో ఏఏ నివాసిత ప్రాంతములయందు ఏర్పాటు చేసిన పోలింగు స్టేషన్ల వివరములను తెలియ చేయడమైనది. 

 ఎన్నికల షెడ్యూలు పూర్తి వివరముల తెలియ చేయడమైనది. మండలంలోని పంచాయతీ అభివృద్ధి అధికారులు గ్రామ రెవెన్యూ అధికారులకు మోడల్ కూడా కండక్టర్ వివరాలపై అవగాహన కల్పించారు.ఈ సమావేశంలోమండలములోని తెలుగుదేశం, జనసేన, వై.ఎ.స్సార్, సిపిఐ మరియు సి.పి.ఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి టి. గోవిందరాజు, అసిస్టెంటు రిటర్నింగ్ అధికారులు అయిన యం.పి.డి.ఓ వైవిఆర్ వి. ప్రసాద్ , తహసీల్దారు టి. నాగరాజు మరియు ఎస్. ఐ జయబాబు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం