📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Uppal : ఉప్పల్ జోన్‌లో ఇద్దరు చోరీ నిందితుల అరెస్ట్.. 20 రోజుల్లో 10 చోరీలు.. 37 తులాల బంగారం స్వాధీనం

తెలంగాణ : హైదరాబాద్ (స్వచ్ఛవార్త) :

ఉప్పల్ జోన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 37 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నవీన్ అనే నిందితుడు కేవలం 20 రోజుల వ్యవధిలోనే 10 చోరీలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. జైలు నుంచి విడుదలైన వెంటనే తిరిగి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి 37 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

మరో కేసులో జయ అనే మహిళను కూడా ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చదువును మధ్యలోనే నిలిపివేసిన ఆమె.. భర్తకు తెలియకుండా ఆన్‌లైన్‌లో చోరీలకు సంబంధించిన పద్ధతులు నేర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చోరీల సమయంలో తన గుర్తింపు బయటపడకుండా బురఖా ధరించినట్లు తెలిపారు. ఈ రెండు కేసులకు సంబంధించి మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Kalidindi : కామినేని ప్రచార జోరు.. ప్రత్యర్థుల్లో టెన్షన్

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి