Velerupadu : ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలపై 6, 7 తేదీల్లో గ్రామసభలు : తహశీల్దార్ శ్రీనివాస్
ఏలూరు జిల్లా : వేలేరుపాడు( స్వచ్ఛవార్త) :
ఈనెల 6 7 తేదీల్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికై మండలంలో ని ముంపు గ్రామాలలో జరుగునున్న గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని, తహసిల్దార్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
నార్లవరం పంచాయతీ కొత్తూరు సచివాలయం, తిరుమలాపురం పంచాయతీ నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(భూశేఖరణ) , యూనిట్ 2,ఏలూరు వారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు నకు గురి అగుచున్న భూములకు సంబంధించి,భూసేకరణ చేసిన భూముల నిమిత్తం గ్రామ సభ నిర్వహించడం జరిగుతుంది.
గ్రామ సభ కు టి . మణి దివ్య సీనియర్ అసిస్టెంట్, జి . జ్యోతి జె ఏ , వి . యామిని సి ఓ ఏ . రామారావు జె ఏ ,.హాజరై స్ట్రక్చర్ వాల్యుయేషన్ వివరములు తెలిపి, అర్జీ లు తీసుకొననున్నారు. సదరు అందుబాటులో లేని మిగిలిన పిడిఎఫ్స్ వివరములు స్థానిక వీఆర్వో కి అందజేయవలసినదిగా తెలిపియున్నారు.
అదేవిధంగా ది.06-10-2026 న కోయిదా, కట్కూరు, సిద్దారం, ది.07-10-2026 న రుద్రంకోట, రేపాకగొమ్ము గ్రామ పంచాయతీలో జరిగే గ్రామ సభల్లో మీకు పెండింగ్ ఉన్న భూమి తాలూకు డబ్బులు, ఇంటికి రావాల్సిన డబ్బుల అర్జీలు స్వీకరిస్తారు. సదరు అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరడమైనది.
