📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Velerupadu : వేలేరుపాడులో ఎక్సైజ్ అధికారుల దాడులు.. అక్రమ మద్యం స్వాధీనం.. పలువురిపై కేసులు నమోదు


పోలవరం, వేలేరుపాడు (స్వచ్ఛవార్త) :

వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం రాత్రి ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పలు దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. వేలేరుపాడు మండలంలోని వసంతవాడ, రేపాకగొమ్ము, భూదేవిపేట, వేలేరుపాడు గ్రామాలలో పలు దుకాణదారులు అక్రమంగా మద్యం విక్రయించడంపై అందిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించి అక్రమ మధ్య స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.  

అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం ఆంధ్ర పరిధిలోనే కుక్కునూరు మద్యం షాపు నుంచి సరఫరా చేసినట్లు సమాచారం, పూర్తి వివరాలు రేపు వేల్లడించగలనని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడుల్లో సీఐ తో పాటు ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. వేలేరుపాడు కు చెందిన ఓ మహిళకు దక్కిన కుక్కునూరు మద్యం షాపు నుంచి అనునిత్యం వేలేరుపాడుకు అక్రమమధ్యం సరఫరా అవుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 

ఆమెకు చెందిన ఈ మద్యం షాపు నుంచి మండలంలోని అన్ని గ్రామాలలో బెల్ట్ షాపులకు నిరంతరం సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు పలువురు ఫిర్యాదు చేయడంతో, స్పందించిన అధికారులు దాడులు నిర్వహించి బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు అక్రమంగా మద్యం విక్రయించటం  చట్ట ప్రకారం నేరంగా భావించి, వసంతవాడ గ్రామానికి చెందిన షోడే వినోద్ అనే బెల్ట్ షాపు యజమానించి 25 క్వాటర్ బాటిల్లు, ఇదే గ్రామానికి చెందిన కుంజా వెంకటేష్ అనే బెల్ట్ షాపు యజమాని వద్ద 41 క్వార్టర్ బాటిళ్లు, రేపాక కొమ్ము గ్రామానికి చెందిన కోడూరి పుల్లారావు అనే బెల్ట్ షాప్ యజమాని నుంచి 25 బాటిళ్లు, అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇంకా మండలంలో పలు గ్రామాలలో అక్రమ మద్యం అధిక ధరలకు అమ్ముతున్నట్లు అధికారులు దృష్టికి పలువురు ప్రముఖులు తీసుకు వెళుతున్నారు. అయితే ఈ దాడుల్లో వాస్తవానికి అక్రమంగా మద్యం విక్రయించే వారి నుంచి అక్రమ మద్యం సేకరించినప్పటికీ, కేసులు విషయానికొత్తే పూర్తి స్థాయిలో సడలించే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయా గ్రామాల్లోని పలువురు యువకులు బహాటంగానే ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నిజా నిజాలు ఆ శాఖ అధికారుల నుంచి వెలువడాల్సి ఉంది.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం