Vinukonda : వైసీపీ నుండి 35 కుటుంబాలు టిడిపిలో చేరిక..పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
పల్నాడు జిల్లా : శావల్యాపురం : స్వచ్ఛవార్త :
వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గుంటుపాలెం గ్రామం నుండి వైసీపీకి చెందిన 35 కుటుంబాలు శనివారం టిడిపిలో చేరాయి. డాక్టర్ అన్నవరపు వీరాంజనేయులు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ పచ్చవ శ్రీనివాసరావు, చాగంటి అంజిబాబు మరో 33 కుటుంబాలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమక్షంలో టిడిపిలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి తామంతా ఆకర్షకులై టిడిపిలో చేరడం జరిగిందని వారు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు టిడిపి సముచిత స్థానం కల్పించి తగిన ప్రాధాన్యత ఇస్తుందని చీఫ్ విప్ జీవీ తెలిపారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సాంబయ్య, క్లస్టర్ ఇంచార్జ్ కోటేశ్వరరావు, గడిపూడి విశ్వనాథం, చింత గంగయ్య, బొల్లా పేరయ్య, అన్నవరపు నరేంద్ర, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ దగ్గుపాటి కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
