📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Amaravati : రాప్తాడు ఘటన నేపథ్యంలో విద్యార్థులకు కౌన్సెలింగ్.. 20 మంది కౌన్సెలర్లతో ప్రత్యేక బృందం

  • విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
  • విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు

అమరావతి : (స్వచ్ఛవార్త)

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి, వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఘటనతో మానసిక ఆవేదనకు గురైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సెలర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారు. ఘటన జరిగిన పదో తరగతి 'ఏ' సెక్షన్‌కు చెందిన 32 మంది విద్యార్థుల ఇళ్లకు కౌన్సెలర్లు స్వయంగా వెళ్లి వారితో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. 

అదేవిధంగా 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థినులందరి ఇళ్లను సందర్శించి అవసరమైన కౌన్సెలింగ్ అందించనున్నారు. ఘటన తాలూకు భయాందోళనల నుంచి విద్యార్థులు బయటపడి, తిరిగి ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు హాజరయ్యేలా కౌన్సెలర్లు మానసిక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా చదువుపై దృష్టి సారించేలా అవసరమైన సహాయాన్ని కొనసాగించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Kalidindi : కామినేని ప్రచార జోరు.. ప్రత్యర్థుల్లో టెన్షన్

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి