Bhimavaram : భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన.. సుమారు రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం
శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడు అరెస్ట్... ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : పట్టణంలోని స్థానిక శ్రీనిధి గ్రాండ్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన వరుస దొంగతనాల కేసును భీమవరం వన్‌టౌన్ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మొత్తం రూ.1,08,80,455 విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్ శనివారం భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఏడు చోరీ కేసులు : పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరం పట్టణం నరసయ్య అగ్రహారంలోని శ్రీనిధి గ్రాండ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న శీలమంతుల కనక మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 22న వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 232/2026, బీఎన్‌ఎస్ సెక్షన్లు 331(4), 305(a) కింద కేసు నమోదు చేశారు. ఇదే అపార్ట్‌మెంట్‌లోని వివిధ ఫ్లాట్లను లక్ష్యంగా చేసుకుని నిందితుడు వరుస దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుక...