Posts

📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Ghantasala : ఘంటసాల జడ్పీ హైస్కూల్లో ఎన్నికల కౌటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జేసీ ఎమ్.నవీన్

Image
కృష్ణా : ఘంటసాల (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్.నవీన్ అన్నారు. ఘంటసాల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌటింగ్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూములను, పరిసర ప్రాంతాలను జేసీ నవీన్ శనివారం పరిశీలించారు.  ఈ సందర్భంగా కౌటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూముల వద్ద తీసుకుంటున్న భద్రతా చర్యలు, ఏర్పాట్లను, ఎన్ని టేబుల్స్ వేస్తున్నారు, ఎన్ని స్థానాలు, అభ్యర్థులు, తదితర విషయాలను మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ కౌటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించి రిటర్నింగ్ అధికారి సుబ్బారావు, సిబ్బందిని అభినందించారు. నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన స్ట్రాంగ్ రూములోని దృశ్యాలు సంబందిత అభ్యర్థులకు కనిపించేలా హైస్కూల్ ప్రాంగణంలో మోనేటర్ ఏర్పాటు చేయాలన్నారు. హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి రిటర్నింగ్ అధికారికి సూచనలు, సలహాలను అందించ...

Jeelugumilli : గౌడ సంఘ పెద్దల కుటుంబాలకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శ

Image
ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి (స్వచ్ఛవార్త) : జీలుగుమిల్లికి చెందిన గౌడు సంఘ పెద్దలు ఉలవల ముత్యం కుమారుడు ఉలవల రామకృష్ణ రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం పట్ల పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జీలుగుమిల్లిలోని ఉలవల రామకృష్ణ నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, చిర్రి కృష్ణయ్య, మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, రూపా సత్యనారాయణ, కూరం వెంకటేష్, రాయి సుబ్బారావు, చిర్రి వెంకటేశ్వరరావు, ఉలవల శివ తదితరులు పాల్గొన్నారు.

Kaikaluru : కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జయమంగళ ప్రచారం

Image
కూటమి అభ్యర్థుల విజయానికి ఓటర్లను అభ్యర్థించిన ఎమ్మెల్సీ జయమంగళ పల్లెవాడ, పెరికేగూడెం, మండవల్లిలో ఎన్నికల ప్రచారం  ఏలూరు జిల్లా : కైకలూరు/మండవల్లి (స్వచ్ఛవార్త) : కైకలూరు నియోజకవర్గంలోని పల్లెవాడ, పెరికేగూడెం, మండవల్లి గ్రామాల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓట్లను వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కైకలూరు మండలం పల్లెవాడ గ్రామంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భలే యేసు రాజు, ఎంపీటీసీ అభ్యర్థి ఘంటసాల విజయలక్ష్మికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జడ్పీటీసీకి సైకిల్ గుర్తుపై, ఎంపీటీసీకి గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మండవల్లి మండలం పెరికేగూడెం గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ శంకరరావు, ఎంపీటీసీ అభ్యర్థి పెరుమాళ్ల సీతకు మద్దతుగా ప్రచారం చేశారు. రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మండవల్లి గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ శంకరరావు, మండల పరిషత్ అధ్యక్ష అభ్యర్థి పల్లపోతు సహద...

Kalidindi : కామినేని ప్రచార జోరు.. ప్రత్యర్థుల్లో టెన్షన్

Image
ఏలూరు జిల్లా : కలిదిండి (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలిదిండి మండలంలో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం ముమ్మరగా సాగుతుంది. శనివారం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని .శ్రీనివాస్ కూటమి పార్టీ అభ్యర్థులతో మూలలంక నుంచి కోరుకొల్లు వరకు భారీ ర్యాలీ తో పర్యటించి కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. జడ్పిటిసి అభ్యర్థి నల్లగోపుల. చలపతిరావు, ఎంపీపీ అభ్యర్థి గొరిపర్తి. వెంకట నరసమ్మ లకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా డాక్టర్ కామినేని మాట్లాడుతూ..  నాయకులు కార్యకర్తలతో కలసి ప్రజలను కలుసుకొని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామాలలో నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేస్తూ వారి విజయానికి కృషి చేయాలని కోరారు. మూలలంక, భాస్కరరావుపేట, సంతోషపురం, అమరావతి, గురవాయిపాలెం, కలిదిండి, పడమటి పాలెం, సానా రుద్రవరం, ఎస్ఆర్పి అగ్రహారం, కోరుకొల్లు గ్రామాల వరకు ఆయా గ్రామాలలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు గాజు గ్లాస్, సైకిల్ గుర్తులపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కామ...

K.kota : కె. కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు

Image
ఏలూరు జిల్లా : కామవరపుకోట (స్వచ్ఛవార్త) :   స్థానిక కామవరపుకోట ప్రభుత్వ  డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు  సూచనలు, కళాశాల ఉన్నత విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం శనివారం రాజనీతి శాస్త్రం, ఎన్. ఎస్. ఎస్ విభాగముల సంయుక్త ఆధ్వర్యంలో "జాతీయ ఐక్యతా దినోత్సవం" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. మధు వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.  అనంతరం ఇంఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్  ఎం మధు  ప్రసంగిస్తూ స్వతంత్ర భారతదేశంలోని అనేక సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతదేశ నిర్మాణంలో పటేల్ ఎంతో కృషి చేశారని పటేల్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు ధారావతు మల్లేష్ ప్రసంగిస్తూ పటేల్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో  ఐక్యత ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఇంఛార్జి  ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం మధు అధ్యాపకులు కె మహేష్ బాబు, ఎస్ సుశ్యలత, ధారావతు మల్లేష్, ఎం విజయ కృష్ణ, పి. కల్పనతో పాటు సిబ...

Veeravasaram : కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి : కేఎన్ఆర్

Image
వీరవాసరం మండలంలో 19 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి ప.గో జిల్లా : వీరవాసరం (స్వచ్ఛవార్త) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్)  పిలుపునిచ్చారు. శనివారం ఆయన సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీరవాసరం మండలంలో జెడ్పీటీసీతో పాటు 19 ఎంపీటీసీ స్థానాల్లోనూ వందకు వంద శాతం విజయం సాధించి, అత్యధిక మెజారిటీతో కూటమి సత్తా చాటాలని అన్నారు. గతంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ధైర్యంగా ఎదిరించి నిలబడిన ఘనత వీరవాసరం మండలానిదని కేఎన్ఆర్ పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు ఎదురైన రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లోనూ కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా పోరాటం చేశారని గుర్తుచేశారు. జిల్లాలో రెండు జెడ్పీటీసీ, రెండు ఎంపీటీసీ స్థానాల్లో కూటమి పక్షాలు విజయం సాధించగా, అందులో వీరవాసరం మండలం కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో టీ...

Uppal : ఉప్పల్ జోన్‌లో ఇద్దరు చోరీ నిందితుల అరెస్ట్.. 20 రోజుల్లో 10 చోరీలు.. 37 తులాల బంగారం స్వాధీనం

Image
తెలంగాణ :  హైదరాబాద్ (స్వచ్ఛవార్త) : ఉప్పల్ జోన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 37 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నవీన్ అనే నిందితుడు కేవలం 20 రోజుల వ్యవధిలోనే 10 చోరీలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. జైలు నుంచి విడుదలైన వెంటనే తిరిగి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి 37 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో జయ అనే మహిళను కూడా ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చదువును మధ్యలోనే నిలిపివేసిన ఆమె.. భర్తకు తెలియకుండా ఆన్‌లైన్‌లో చోరీలకు సంబంధించిన పద్ధతులు నేర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చోరీల సమయంలో తన గుర్తింపు బయటపడకుండా బురఖా ధరించినట్లు తెలిపారు. ఈ రెండు కేసులకు సంబంధించి మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Rajamahendravaram : ఏసీబీ వలలో అగ్నిమాపక అధికారి.. రూ.65 వేల లంచం తీసుకుంటూ

Image
ఐదు బాణాసంచా దుకాణాలకు ఫైర్ ఎన్‌ఓసీల పేరుతో రూ.75 వేలు డిమాండ్‌ తూ. గో జిల్లా :రాజమహేంద్రవరం ( స్వచ్ఛవార్త) : ఐదు బాణాసంచా దుకాణాలకు ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేయడంతో పాటు, దుకాణాల తనిఖీల కోసం లంచం తీసుకుంటూ రాజమహేంద్రవరం సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి (ఏడీఎఫ్‌ఓ) పి. శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రూ.75 వేలు డిమాండ్ చేయగా, చివరకు రూ.65 వేలు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడు ఐదు బాణాసంచా దుకాణాలను నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన పెసో (PESO) లైసెన్సులు 2028, 2035 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉన్నాయి. రాబోయే దీపావళి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక దుకాణాలకు ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న దుకాణాల తనిఖీల కోసం ఒక్కో దుకాణానికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.75 వేలు ఇవ్వాలని ఏడీఎఫ్‌ఓ శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. చివరకు రూ.65 వేలు ఇచ్చేందుకు అంగీకరించడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ అధికారులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ ...

Kaikaluru : కైకలూరులో టిప్పర్ బీభత్సం.. తాత మృతి, మనవడికి గాయాలు

Image
ఏలూరు జిల్లా : కైకలూరు టౌన్ (క్రైమ్), స్వచ్ఛవార్త :  మనవడిని పాఠశాలలో దింపేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతుని మనవడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఏలూరు జిల్లా కైకలూరు ప్రభుత్వ జడ్పీ పాఠశాల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కైకలూరు మండలం ఆటపాక గ్రామానికి చెందిన ముంగర దుర్గాప్రసాద్ (60) తన ఐదేళ్ల మనవడు మోక్షిత్ పవన్‌ను కైకలూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో దింపేందుకు శుక్రవారం ఉదయం స్కూటీపై బయలుదేరాడు. ప్రభుత్వ పాఠశాల సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ (ఏపీ 07 టీఎఫ్ 4466) స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ రోడ్డుపై పడిపోగా, టిప్పర్ లారీ అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనవడు మోక్షిత్ పవన్ రోడ్డుకు అవతలి వైపు పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న కైకలూరు పట్టణ ఇన్స్పెక్టర్ ఏవీఎస్ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని కైకలూరు ప్రభుత్వ ...

Kaikaluru Rural Circle : స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పోలీసుల పర్యటన.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలకు పలు సూచనలు

Image
ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ (స్వచ్ఛవార్త) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పరిధిలో  ప్రశాంతకార వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్ ఆదేశాల మేరకు డి.ఎస్.పి శ్రవణ్ కుమార్ సూచనలతో కైకలూరు రూరల్ సీఐ వి రవికుమార్ పర్యవేక్షణలో గురువారం కైకలూరు రూరల్ సర్కిల్ పరిధి లోని కైకలూరు రూరల్, ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో  ఆయా పోలీసు స్టేషన్ల అధికారులు పర్యటించి ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు సూచనలు చేశారు. కైకలూరు రూరల్ ఎస్సై వి. రాంబాబు సీతనపల్లి, దొడ్డిపట్ల గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ముదినేపల్లి మండలంలోని అల...

Mandavalli : పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : అధికారులకు కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరిక

Image
ఏలూరు/ మండవల్లి (స్వచ్ఛవార్త) : ప్రకృతి వైపరీత్యాల అనంతరం పారిశుద్ధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. మండవల్లి మండలంలోని పలు గ్రామాలలో గురువారం పర్యటించి పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాల పునరుద్ధరణ పనులను పరిశీలించి, ప్రతీ ఒక్కరినీ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండవల్లి మండలం నుచ్చిమిల్లి గ్రామంలో రోడ్లపై మురుగు నీరు నిలిచి ఉండడం, రోడ్లపై చెత్తను తీయించకపోవడంపై పంచాయతీ కార్యదర్శి పద్మ, ఎంపిడిఓ కె. రమణబాబు లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రోడ్లపై మురుగు నీరు, చెత్త కారణంగా దోమలు పెరిగి విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతాయని, అధికారులు నిర్లక్ష్యం వీడి, తుఫాన్ అనంతరం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామంలోని గాలి ప్రవీణ్ బాబు, గాలి డాన్ బాస్, పరిసర గృహాల వారిని విద్యుత్ సరఫరా ఎప్పుడు వచ్చింది, త్రాగునీరు సక్రమంగా వస్తుందా లేదా, తుఫాన్ అప్రమత్తత, విద్య...

Machilipatnam : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి – జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు

Image
కృష్ణా : జిల్లా పోలీస్ కార్యాలయం (స్వచ్ఛవార్త) : కృష్ణాజిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అనంతరం, తదుపరి నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియకు బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్ సరళికి సంబంధించి కృష్ణా యూనివర్సిటీ, పెడన పల్లోటి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఈరోజు పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది సంఖ్య, సిబ్బంది విధుల కేటాయింపు, నిరంతర నిఘా తదితర అంశాలను ఎస్పీ గారు క్షుణ్ణంగా సమీక్షించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ సమయంలో వచ్చే ప్రజల వాహనాలు పార్కింగ్ విషయంలో చేపట్టవలసిన చర్యలను గూర్చి తెలిపారు. అదేవిధంగా, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలి...

Eluru : జిల్లాలో రేపటి నుంచి పింఛన్ల పంపిణీ : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Image
ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ (స్వచ్ఛవార్త) : జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల పంపిణీ ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,52,397 మంది పింఛనుదారులకు రూ.111.04 కోట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 30న పింఛను తీసుకోలేని లబ్ధిదారులకు నవంబర్ 5వ తేదీ వరకు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ కోసం జిల్లావ్యాప్తంగా 4,916 మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు. నవంబర్ నెల పింఛన్ల పంపిణీపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. అక్టోబర్ 30న పింఛన్ల పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. పింఛనుదారులకు ముందస్తుగా సమాచారం అందించి, పింఛను తీసుకునే సమయంలో సంబంధిత సచివాలయ సిబ్బందికి తమ ఇళ్ల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని జెడ్పీ సీఈవో ఎం. కృష్ణమోహన్, డీఆర్డీ...

Vijayawada : వంగవీటి రాధాకృష్ణకు ఆంధ్రా తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి మద్దతు

Image
విజయవాడ : స్వచ్ఛవార్త :  విజయవాడ నగర మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణకు ఆంధ్రా తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ మద్దతు ప్రకటించింది. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నాస పూర్ణచంద్రరావు( కాళ్లపాలెం బుజ్జి) ఆధ్వర్యంలో మిత్ర బృందం సభ్యులు గురువారం విజయవాడ బందర్ రోడ్డులోని కార్యాలయంలో రాధాకృష్ణను కలిసి ఎన్నికల సందర్భంగా తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి, మిత్ర బృందం సభ్యులు రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. నగర మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఆంధ్రా తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయనకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సోషల్ మీడియా అధ్యక్షుడు చెల్లు వెంకట్‌తో పాటు యాళ్ల కళ్యాణ్, కూరెళ్ల కళ్యాణ్, గణిశెట్టి నాని, చలాగాళ్ల సాయి రామకృష్ణ, రవి బాబు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థికి మద్దతు తెలియజేసేందుకు మిత్ర బృందం సభ్యులంతా కలిసి కార్యాలయానికి వెళ్లారు. విజయవాడ నగర మేయర్ ఎన్నికల సందర్భంగా వంగవీటి రాధాకృష్ణను కల...

Mudinepalli : అమరావతి అభివృద్ధికి బి. దయానందం, ఆర్. రాజ్‌కుమార్ కుటుంబాల రూ.1,116 విరాళం

Image
ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) : ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి అంబుల మనోజ్ లు పిలుపునిచ్చారు. “అమరావతికి జీవం పోద్దాం – రూ.116 సాయం చేద్దాం” కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ ముందుకొచ్చి రాజధాని అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ...  రాజధాని అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఒక్కరూ తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించి అమరావతి నిర్మాణానికి సహకరించాలని అన్నారు. చిన్న మొత్తాల్లో అందించే విరాళాలు సైతం సమష్టి కృషికి బలాన్నిస్తాయని పేర్కొన్నారు. ఈ పిలుపునకు స్పందిస్తూ విజయవాడకు చెందిన జె.పి.ఎఫ్. (JPF) వ్యవస్థాపక అధ్యక్షుడు బి. దయానందం, ఆర్. రాజ్‌కుమార్ తమ రెండు కుటుంబాల తరఫున అమరావతి రాజధాని అభివృద్ధికి విరాళం అందించారు. గురువారం ఉదయం ముదినేపల్లిలోని ఆసుపత్రికి వచ్చిన వారు ఏపీసీఆర్డీఏ (APCRDA) క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాన్ని చెల్లించారు. రెండు కుటుంబాలు కలిపి మొత్తం రూ.2,232 విరాళంగా అందించారు. అమరావతి అభివృద్ధికి తమ వంతు సహక...

Machilipatnam : తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి

Image
కృష్ణా : మచిలీపట్నం/ఎంపీ కార్యాలయము (స్వచ్ఛవార్త) :   బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను నేపథ్యంలో మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, పాత భవనాలు, చెట్లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు. జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనాలి : తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలవాలని ఎంపీ బాలశౌరి జనసేన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని, ఆహారం, తాగునీరు, మందులు వంటి అత్యవసర సదుపాయాలు అవసరమైన వారికి అందించేందుకు స...

Bhimavaram : తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించిన "కేఎన్ఆర్"

Image
ప్రజలను అప్రమత్తం చేస్తూ.. అధికారులతో పరిస్థితిపై సమీక్ష... ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నష్టం జరిగిన భీమవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(కేఎన్ఆర్) బుధవారం పరిశీలించారు. తుఫాన్ కారణంగా ఎదురైన ఇబ్బందులపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, పరిస్థితులపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ, ప్రజల భద్రతకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకున్నారు.

Kaikaluru : జోరువానలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కామినేని పర్యటన

Image
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి... ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) : అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ బుధవారం జోరువానలో పలు ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ ప్రభావాన్ని, నష్ట తీవ్రతను పరిశీలించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..  తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని, వెంటనే సంబంధిత అధికారులకు లేదా తన కార్యాలయ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు, వివిధ శాఖల అధికారులు గత రాత్రి నుంచే సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే సూచించారు. తుఫాన్ ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్...

Bhimavaram : అర్నాబ్ బీభత్సం.. భీకర గాలులు.. నేలకొరిగిన భారీ వృక్షాలు.. స్వయంగా రంగంలోకి దిగిన డి.ఎస్.పి రఘువీర్

Image
ప.గో జిల్లా : భీమవరం/లోసరి (స్వచ్ఛవార్త) :  అర్నాబ్ తుఫాన్ ధాటికి భీమవరం పట్టణం అల్లకల్లోలంగా మారింది. బుధవారం తెల్లవారుజామున వీచిన బలమైన గాలులకు భీమవరం మండలంలోని లోసరి రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు స్వయంగా చైన్‌సాతో చెట్లను కట్ చేసి తొలగించే చర్యల్లో పాల్గొన్నారు.  సిబ్బందితో కలిసి రహదారిపై అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు .

Kaikaluru : కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి : ఎమ్మెల్సీ జయమంగళ

Image
ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటుతూ జనసేన పార్టీ ఆశావహులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. మంగళవారం ఆటపాకలోని తన కార్యాలయంలో జనసేన నాయకులు చనుమోలు చంద్రశేఖర్, కొల్లి వరప్రసాద్ (బాబీ), దాసరి రమేష్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పిలుపు మేరకు కైకలూరు నియోజకవర్గంలో బలమైన స్థానాల్లో పోటీ చేసేందుకు పలువురు జనసేన నాయకులు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. అయితే, పార్టీ తరఫున బీ-ఫారాలు పొందిన అభ్యర్థులకే అవకాశం కల్పిస్తూ, మిగిలిన ఆశావహులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారని తెలిపారు. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆశావహులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున 16 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జయమంగళ వెంకటరమణ వెల్లడించారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత కొనసాగించడం ముఖ్యమని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, ...

Bhimavaram : స్థానిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన నేతలు

Image
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :   భీమవరం, వీరవాసరం మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు పార్టీ తరఫున బీ-ఫారాలను అందజేశారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు భాష్యం రామకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Nuziveedu : అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : తహసీల్దార్ షేక్ షంషుద్దీన్

Image
ఏలూరు జిల్లా : నూజివీడు (స్వచ్ఛవార్త) : తీవ్ర తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ షేక్ షంషుద్దీన్ సూచించారు. సోమవారం అధికారులు, పంచాయతీ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ప్రజలకు పలు రక్షణ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలు మరియు పాత ఇళ్లలో నివసించే వారు ముందుజాగ్రత్తగా సమీపంలోని సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. గాలులు, వర్షాల కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పర్యటనలో వీఆర్వో ఎస్. సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి షేక్ రాహీదతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Machilipatnam : లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

Image
అర్ణబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – ప్రజల ప్రాణరక్షణే అత్యంత ప్రాధాన్యం పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు తప్పనిసరి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలపై జిల్లా అధికారులతో కలెక్టర్ డీకే బాలాజి సమీక్ష కృష్ణా :మచిలీపట్నం కలెక్టరేట్‌ (స్వచ్ఛవార్త) : అర్ణబ్ తుపాను నేపథ్యంలో ప్రజల ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి జిల్లా అధికారులతో పాటు తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ముందస్తు చర్యలు, ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, అత్యవసర సహాయక చర్యలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర స్థాయి ఆర్టిజిఎస్ నుంచి అందిన సమాచారం ప్రకారం తుపాను తన దిశను మార్చుకుని దక్షిణ దిశగా కదిలే అవక...

Mudinepalli : వైవాకలో జెడ్పీటీసీ అభ్యర్థి బొర్రా చలమయ్య ఎన్నికల ప్రచారం.. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బీసీ నాయకుల మద్దతు

Image
ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) :  మండలంలోని వైవాక గ్రామంలో ముదినేపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బొర్రా చలమయ్య సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి బీసీ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు గంగునేని వరప్రసాద్ ఆధ్వర్యంలో చలమయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కైకలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొత్త నాగబాబు, ఎంపీపీ అభ్యర్థి కోటప్రోలు నాగరత్నకుమారి తనయుడు, బీజేపీ నాయకుడు కోటప్రోలు కృష్ణ, కైకలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కట్టా గోపి, జక్కుల విజయ్, పెదగొన్నూరు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి శివ, మరిపి శివ, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బలే చిరంజీవి, పరసా ఏడుకొండలు, గుమ్మా రాము, దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Mandavalli : కొల్లేరు సమస్యకు పరిష్కారం చూపుతున్న ప్రభుత్వానికి మద్దతివ్వాలి.. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ జయమంగళ విజ్ఞప్తి

Image
ఏలూరు జిల్లా :  మండవల్లి (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం మండవల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు మద్దతుగా పులపర్రు, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక, మణుగులూరు, పెనుమాకలంక, నందిగామలంక, శ్రీరామనగరం, ఇంగిలిపాకలంక, మూడు తాళ్లపాడు, తక్కెళ్లపాడు, నుచిమిల్లి గ్రామాల్లో పర్యటించి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ..  కొల్లేరు సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Gudlavalleru : ఆశ్వీయుజ పౌర్ణమి వేళ శ్రీ కొండలమ్మ సన్నిధిలోరుద్ర సహిత చండీ హవనం

Image
కృష్ణా : గుడ్లవల్లేరు /వేమవరం (స్వచ్ఛవార్త) : ఆశ్వీయుజ పౌర్ణమి సందర్భంగా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో రుద్ర సహిత చండీ హవనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ముఖ్య అర్చకుడు రుద్రపాక శివ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో దేవస్థాన సిబ్బంది సమిష్టిగా కృషి చేసి నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, మండలి సభ్యురాలు నూతలపాటి లక్ష్మీ పావని, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఈ వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.